సాదాసీదాగా ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఆడంబరాలు లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నేతలతో ముఖ్యనేతలతో చర్చించిన సీఎం కేసీఆర్ జూన్ 2న నిర్వహించే వేడుకలు గతంలో మాదిరిగా పబ్లిక్ గార్డెన్స్, జిల్లా కేంద్రాల్లో వద్దని, గవర్నమెంట్ ఆఫీసుల్లో జాతీయజెండాలు మాత్రం ఎగరవేయాలని సూచించినట్లు సమాచారం. ఎట్హోం, కవి సమ్మేళనాలు, సాంస్క•తిక కార్యక్రమాలు, ఇతర ఉత్సవాలు అన్నీ రద్దేనని సృష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర అవతరణ వేడుకలు లేనందున ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కూడా ఈ ఏడాది రద్దు చేసినట్లు తెలుస్తోంది.













