ఆ ఛాన్స్ నాకు దక్కింది : కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. గన్‌పార్క్‌లో స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం సచివాలయం వద్ద జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానానికి పదేళ్లు పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం రక్తసిక్తమైంది. శాంతియుతంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయి. మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించే అవకావం నాకు దక్కింది. రాష్ట్ర సాధనలో అమరులైనవారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది అని కేసీఆర్ పేర్కొన్నారు.













