ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్‍లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సాహ్ని జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‍తో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో తెలంగాణ భవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.