అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా కొలంబస్ నగరం, ఒయహో రాష్ట్రంలోని బీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంలో అడ్వైసరీ బోర్డు నేత మహేష్ నాయకత్వంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ బాల్యమిత్రుడు సిద్దిపేటకు చెందిన ఉమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనతి కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారని మహేష్ అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, విద్యుత్, వ్యవసాయం, సాగు, తాగునీరు ఇలా ఏ రంగంలోనైనా ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. చిన్నప్పటి నుంచే సీఎం కేసీఆర్ పట్టుదలతో పని చేసే వారని ఉమారెడ్డి అన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ వ్యూహరచన, రాజకీయ చాత్యురాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.













