బిఆర్ కెఆర్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 ను పురస్కరించుకొని బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయగీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం













