రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత తెలంగాణకే దక్కిందని కొనియాడారు. ప్రజలెంత సుఖసంతోషాలతో ఉన్నారనే అంశాన్ని బట్టి ఆయా ప్రభుత్వాల విజయం ఆధారపడుతుందన్న గవర్నర్… అతి త్వరలోనే బంగారు తెలంగాణ సాక్షాత్కరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నా రాష్ట్రం- నాకు గర్వకారణం అనే రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.













