జాతీయ పంచాయతీరాజ్ పురస్కారాల్లో తెలంగాణకు అగ్రస్థానం
జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ పలు పురస్కారాలు దక్కించుకుంది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 9 విభాగాల్లో కలిపి 27అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని పలు పంచాయతీలు 8 అవార్డులను దక్కించుకున్నాయి. 4 కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలు, మొదటి, రెండో స్థానంలో నిలిచాయి. వాటర్ సఫిషియంట్ పంచాయతీ విభాగం – జనగామ జిల్లా నెల్లుట్లకు అగ్రస్థానం అగ్రస్థానం దక్కింది. సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగం – మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్పల్లికి మొదటి స్థానం లభించింది. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగం – సూర్యాపేట జిల్లా ఐపూర్కు అగ్రస్థానం దక్కింది. పావర్టీ ఫ్రీ విభాగం గద్వాల జిల్లా మాన్‌దొడ్డికి రెండో స్థానం లభించింది. జాతీయ పంచాయతీరాజ్ అవార్డులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం సీఎం కేసీఆర్ దార్శనికతలకు నిదర్శనమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకు ఎనిమిది అవార్డులు వచ్చాయని, నాలుగు కేటగిరీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బృందానికి అభినందనలు తెలిపారు.













