రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు ఎన్నో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 60 మంది వ్యయ పరిశీలకులను నియమించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిసనర్ వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లు, తదితర అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసన సభ ఎన్నికల పోలింగ్ కోసం 36వేల ఈవీఎంలు సిద్ధం చేశాం. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్ చేసి తపాలశాఖ ద్వారా పంపిణీ చేశాం. 60 మంది వ్యయ పరిశీలకులను నియమించాం. 3 కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించాం. ఇప్పటికే 9వేలకు పైగా ఓటర్లు హోం ఓటింగ్ వేశారు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిపుల పంపిణీ పూర్తి చేశాం. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆరు నియోజకవర్గాల్లో 5వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తాం. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకులు ఉంటారు.













