తెలంగాణలో ‘పరీక్షా’ కాలం ప్రారంభం… ‘సెట్’ పరీక్షల తేదీలను ప్రకటించిన సర్కార్
‘సెట్’ పరీక్షలను నిర్వహించేందుకు సర్కార్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ‘సెట్’ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. వివిధ సెట్ పరీక్షలకు సంబంధించిన సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. సెట్ పరీక్షల నిర్వహణలో కోవిడ్ జాగ్రత్తలను కచ్చితంగా తీసుకుంటామని, అందులో సందేహ పడాల్సిన అవసరమే లేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి…..
- ఎమ్సెట్ (ఇంజినీరింగ్).. ఆగస్టు 4,5,6 తేదీలు
- ఎమ్సెట్ (అగ్రికల్చర్, మెడికల్) ఆగసట్ు 9,10 తేదీలు
- ఈసెట్ : ఆగస్టు 3
- పీజీ ఈసెట్ : ఆగస్టు 11 నుంచి 14 వరకూ
- ఐసెట్ : ఆగస్టు 19,20 తేదీలు
- లాసెట్ : ఆగస్టు 23
- ఎడ్సెట్ : 24,25 ఆగస్టు
- పాలిసెట్ : జూలై 17













