24న ప్రవాసీ తెలంగాణ దివస్
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24న రవీంద్ర భారతిలో ప్రవాసీ తెలంగాణ దివస్-2023 నిర్వహించనున్నట్లు ఫోరం వ్యవస్థాపకుడు డీపీరెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్టా రాజేశ్వర్ తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో ప్రవాసీ తెలంగాణ దివస్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అద్యక్షుడు శేర్ నర్సారెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్ రఫీ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా ప్రతినిధులు మారకంటి భవానీరెడ్డి, గాలి రెడ్డి, నరేంద్ర రెడ్డి, నరసింహారెడ్డి, వరలక్ష్మి పాల్గొన్నారు.













