తెలంగాణలో పాఠశాలు, కళాశాలలకు..ఏప్రిల్ 27 నుంచి
తెలంగాణలోని పాఠశాలు, జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్, విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించినట్లు తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు తెలిపారు. 1 నుంచి 9 తరగతులకు చెందిన 53,70,388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరిచే విషయంపై జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఏప్రిల్ 26ను ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి పనిదినంగా పరిగణిస్తామని మంత్రి చెప్పారు.













