యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్
మొదటి సారిగా చీఫ్ సెక్రెటరీ గా పదవి బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ గారూ శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు బాలా ఆలయ మండపంలో అర్చకస్వాములు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు అనంతరం సోమేష్ కుమార్ దంపతులకు లడ్డూ ప్రసాదం అందించారు అనంతరం ఆలయ పునర్నిర్మాణం స్వయంభు ఆలయ పనులను పరిశీలించారు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావ్ ఆలయ ఈవో గీత భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులు వారి వెంట ఉన్నారు.













