కొద్దిపాటి జర్వం ఉన్నా చూపించుకోండి : సీఎస్ సోమేశ్ కుమార్

స్వల్పంగా జ్వరం లక్షణాలున్నా సరే దగ్గర్లోని ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. పరీక్షల తర్వాత వైద్యులు ఇచ్చే మందులను తప్పనిసరిగా వాడాలని కోరారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను సోమేశ్ కుమార్ తనిఖీ చేశారు. బొగ్గుల కుంటలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో కోవిడ్ కౌన్సిలింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.