తెలంగాణలో ఉద్యోగుల పదోన్నతులను జనవరి 31 లోగా పూర్తి చేయాలి: సీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో సెక్రటెరియట్, HODs మరియు జిల్లా స్ధాయిలలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులను, HOD ల ఉన్నతాధికారులను ఆదేశించారు.
సోమవారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు మరియు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రమోషన్ల తో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వలన వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పోస్టుల భర్తీ అంశాలపై ప్రతి వారంలో బుధవారం (జనవరి 6, 20, 27 తేదీలు) సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి విజన్ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు , HOD లు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని హామి ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సలహాదారులు శ్రీ అనురాగ్ శర్మ, శ్రీ కె.వి.రమణా చారి, శ్రీ ఎ.కె.ఖాన్, శ్రీ ఎస్.కె.జోషి లతో పాటు డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, పోలీస్ అధికారులు శ్రీ పూర్ణ చందర్ రావు, శ్రీ గోపి కృష్ణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీమతి రాణి కుముదిని, శ్రీ సురేష్ చందా, శ్రీ అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు శ్రీ రజత్ కుమార్, శ్రీ అర్వింద్ కుమార్, శ్రీ రామక్రిష్ణారావు, శ్రీ సునీల్ శర్మ, శ్రీ జయేష్ రంజన్ , శ్రీ రవిగుప్తా, శ్రీ హర్ ప్రీత్ సింగ్, కార్యదర్శులు మరియు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.













