తెలంగాణలో మరో పది రోజుల పాటు.. లాక్‍డౌన్

తెలంగాణ రాష్ట్రంలో మరో 10 రోజులు పాటు లాక్‍డౌన్ పొడగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ సడలింపులు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల స్థానంలో మధ్యాహ్నాం 1 గంట వరకు రిలాక్షేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు లాక్‍డౌన్ ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్‍డౌన్‍ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
కరోనా నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడబరంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికి ఇప్పటికిప్పుడు లాక్‍డౌన్ ఎత్తేస్తే కేసులు పెరిగె ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.