గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ ఆ ఇద్దరు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్‌లను ఖరారు చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను మరోసారి కేబినెట్ తీర్మానం చేసింది. వీరిద్దరి పేర్లను గవర్నర్‌కు ప్రభుత్వం పంపించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ను ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్‌లను సచివాయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.