ఏపీలో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చంద్రబాబు మంచి విజన్ కలిగిన నాయకుడన్నారు. హైదరాబాద్ అభివృద్ధి వెనక చంద్రబాబు కృషి ఎంతగానో ఉందని సృష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ బతికితేనే ప్రజలకు మంచిదన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని పేర్కొన్నారు. అప్పుడు హోదా అడగని కేసీఆర్ ఇప్పుడు అడగడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మెదక్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.













