పార్టీ కోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో .. నాకు తెలుసు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో, చేస్తున్నారో తనకు తెలుసని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ విభేదాలు ఉంటే రాష్ట్ర ఇన్చార్జితో లేదా నాతో మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడొద్దు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుంది. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలి అని రాష్ట్ర నేతలకు సూచించారు.













