ఆగస్టు 4 నుంచి 9వరకు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది. పెట్టుబడులను ఆకర్శించే లక్ష్యంతో సీఎం అమెరికాలో పర్యటించి పలు సంస్థలు, కంపెనీలు, పెట్టుబడిదారులతో మమేకమవనున్నారు. ఎంవోయూలు చేసుకోనున్నారు. పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్లు సమాచారం. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టు బడులను సమీకరించే అవకాశం ఉందని తెలిసింది.
అమెరికా పర్యటనకు సీఎంతోపాటు పరిశ్రమలు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. న్యూయార్క్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూ జెర్సీ ప్రాంతాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలతో సీఎం సమావేశం అవుతారు. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. న్యూజెర్సీలోప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించనున్నారు.