సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానున్నారు. డల్లాస్ తదితర రాష్ట్రాల్లో ఈ పర్యటన సాగనుంది. ఆగస్టు 11న రేవంత్ రెడ్డి అమెరికా నుంచి తిరిగి రానున్నారు.