ఉజ్జయిని మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయన అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, జిహెచ్హెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.













