పూరీ జగన్నాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు ఒడిషాలోని పూరీ జగన్నాథస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద చేరుకన్న సీఎం కేసీఆర్‌కు పూరీ ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కోణార్క్ ఆలయాన్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అక్కడ నుంచి కోల్‌కతా వెళతారు. పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత్ర మమతా బేనర్జీతో భేటీ కానున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేయేతర ఫ్రంట్ లక్ష్యంగా దేశ వ్యాప్త పర్యటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే.













