ఈ నెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో అధికార బీఆర్ఎస్ వేగంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులతో ఈ నెల 15న గులాబీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీఫారామ్లు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందే జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 15న హుస్సాబాద్, 16న జనగామ, భువనగిరి, 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చల్ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రజల ఆశీర్వాదం కోరుకున్నారు.













