కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సీఎం కేసీఆర్ ఐసోలేషన్‍లో వుంటున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెస్‍తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోను నెగిటివ్ గా రిపోర్టులు వచ్చాయి. రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు.