ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించారు. ప్రధానంగా కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని మోదీని కేసీఆర్ కోరినట్లు తెలుస్తుంది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి మరోసారి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించినట్లు సమాచారం. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించాలని కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ఐఐఐటీ, ఐఐఎం మంజూరుతో పాటు కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుపై మోదీతో కేసీఆర్ చర్చించనట్లు సమాచారం.













