దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ
మాజీ ప్రధాని, జనతాదళ్ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరులో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం తాను ప్రతిపాదించిన కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై దేవెగౌడతో కేసీఆర్ చర్చలు చేపట్టారు. అంతకుముందు తన నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు దేవెగౌడ సాదరంగా ఆహ్వానం పలికారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, నటుడు ప్రకాశ్‌రాజ్ ఉన్నారు. తాజాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం గల దేవెగౌడతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జనతాదళ్-ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉంటోంది. కర్ణాటక లో జరగనున్న ఎన్నికల్లోనూ విడిగా పోటీ చేస్తోంది. తమ లక్ష్యాలకు అనుగుణంగా జేడీఎస్ పనిచేస్తున్నందున దేవెగౌడను కలిసి కొత్త కూటమిపై చర్చించాలని కేసీఆర్ భావించారు.













