పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్
పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిలాలు నింపిన కలశాలకు వేదపండితులు పూజలు చేశారు. కలశాలను పలుగ్రామాల సర్పంచ్‌లకు అధికారులు అందయజేయనున్నారు. కృష్ణా జలాలతో పలు గ్రామాల్లో దేవుళ్లకు ప్రజాప్రతినిధులు పూజలు చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్స కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













