సేద్యం నేత సిఎం కెసిఆర్
తిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు 2017కు సిఎం కె చంద్రశేఖర్‌రావు ఎంపికయ్యారు. పాలసీ లీడర్ షిప్ కేటగిరి కింద కెసిఆర్ అవార్డు అందుకోనున్నారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కెసిఆర్‌ను అవార్డుకు ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో అవార్డు అందిస్తారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశం దృష్టిని ఆకట్టుకున్నాయి. చెరువుల పూడికతీత, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత, 17వేల కోట్లమేర వ్యవసాయ రుణాల మాఫీవంటి ప్రభుత్వ చర్యలతో సాగురంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఎకరానికి సాగునీటిని అందేలా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేస్తూ కోటి ఎకరాలకు సాగునీటిని అందించేలా బడ్జెట్లో ఏటా 25వేల కోట్లు కేటాయిస్తున్నారు.
దేశంలో తొలిసారిగా ఎకరాకు ఏటా 8 వేల రూపాయల చొప్పున రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించాలనీ నిర్ణయించారు. ఈ యాసంగి నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమలులో భాగంగా ఇప్పటికే మూడు జిల్లాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను పరిగణలోకి తీసుకుని కెసిఆర్‌కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డుకు ఎంపిక చేశారు..













