ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ కేబినెట్ కీలక భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తారు. వ్యవసాయ పరిస్థితులు, పంటలు, ధాన్యం సేకరణ, ఎరువులు, విత్తనాలతో పాటు కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై ఈ కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించడమా? లేదా అన్‌లాక్ చేయడమా? అన్న దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటారని కొందరు పేర్కొంటున్నారు.