ఆగస్టు 1న మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 13 వరకు అమెరికా పర్యటనకు వెళ్తున్నందున ఒకటో తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. శాఖల వారీగా మంత్రివర్గం ఆమోదానికి నివేదించాల్సిన అంశాలను సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. అమెరికా పర్యటనకు సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర శాఖల అధికారులు వెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉండటంతో వారితో చర్చలు జరిపేందుకు సీఎం వెళ్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.