తెలంగాణలో మహా కష్టంగా మారుతున్న మహాలక్ష్మి పథకం..

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇచ్చిన మాట ప్రకారం గత సంవత్సరం డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పుణ్యమా అని ప్రయాణికుల సంఖ్య పెరిగింది కానీ.. ఆదాయం మాత్రం పూర్తిగా పడిపోయింది. గతంలో గట్టిగా 11 లక్షలు కూడా లేని ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 21 లక్షలకు చేరుకుంది. అయితే బస్సు పాసులు తీసుకొని ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా 40 శాతం పడిపోయింది. విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు.. కాలేజ్ ,ఆఫీస్, షాపింగ్ ఇలా ఏ పనికి వెళ్లాల్సి వచ్చినా సిటీ బస్సులు వాడే మహిళల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఆటోలో వెళ్లేవారు కూడా ఇప్పుడు బస్సులో వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాపం దీంతో ఆటో వాళ్ళ పరిస్థితి కూడా అంతంతమాత్రంగా మారింది. ఆడవారికి ఉచిత బస్సు పథకం తెలంగాణ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత జటిలం కాకుండా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.