మార్చి 7న తెలంగాణ బడ్జెట్
మార్చి 7వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖారారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల తేదీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మార్చి 6వ తేదీన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై 2022`23 ఆర్థిక సంత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ఆమోదం తెలుపనుంది. మార్చి 7న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.













