తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కుదింపు?
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ప్రభావం సాక్షాత్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపైనే పడింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు కరోనా సోకింది. తాజాగా… మరో ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డికి కూడా కరోనా సోకింది. వీటిని దృష్టిలో పెట్టుకునే సమావేశాలను కుదించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు బీఏసీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల కుదింపుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 వరకూ సమావేశాలు జరిగాల్సి ఉంది. కరోనా కారణంగా కుదిస్తారా? లేదా యథావిథిగానే కొనసాగిస్తారా? అన్నది మాత్రం ఇంకా తేలలేదు. మరో వైపు మంగళవారం సర్కార్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది.













