ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్ట్
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం స్టేషన్‌కు తరలించారు. ప్రతి ఏటా తాను హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటానని, ఈ ఏడాది కూడా వెళ్లాలనుకుంటున్న తనను పోలీసులు ఆక్రమంగా అరెస్టు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణలో 8వ నిజాం పాలన నడుస్తోందని మండిపడ్డారు. గౌలిగూడ రామమందిరంలో పూజలు నిర్వహించిన శోభయాత్రలో పాల్గొనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తనను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.













