వారంతా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో
తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌పై ఉన్న రిట్ పిటిషన్‌పై వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. సోమేష్ కుమార్‌పై 2017లో భారత ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఎందుకు ఆగిందో తేల్చాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు కేసు రాకుండా ఎవరు తొక్కిపెడ్తున్నారో తేల్చాలన్నారు. నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడిన సోమేష్ కుమార్ తెలంగాణలో ఎలా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేస్తోన్న తెలంగాణ సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమేష్ కుమార్‌తో పాటు మరో 12 మంది అధికారులు కూడా ఆంధ్రాకు కేటాయించిన అధికారులే అని, వారంతా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నారని తెలిపారు.













