బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు …14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ కోర్టు తిరస్కరించింది. బండి సంజయ్‌తోపాటు మరో నలుగురికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. బండి సంజయ్‌ని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో బండి సంజయ్‌పై నమోదైన 10 కేసులను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని గతంలో నమోదైన ఐపీసీ 353 సెక్షన్ కింద నమోదైన కేసులపై బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేయూలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి, అరెస్ట్ చేశారు.













