50 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ శాసనసభ సమావేశాలను 50 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. నేడు బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. 50 రోజుల పాటు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పశ్న్రోత్తరాల సమయాన్ని గంట నుంచి గంటన్నరకు పెంచారు. రేపు ప్రశ్నోత్తరాల అనంతరం సభను వాయిదా వేస్తారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల, చీఫ్ విప్ కొప్పు ఈశ్వర్, జానారెడ్డి, కిషన్‌రెడ్డి, భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, సండ్రవెంటక వీరయ్య పాల్గొన్నారు.













