ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దు.. తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టి తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని పెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతర సభ వాయిదా పడింది. మరోవైపు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ మేరకు సభ్యులకు లేఖలు పంపామని, వ్యక్తిగత ఆహ్వానంగా భావించి అందరూ రావాలని కోరారు.













