23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శాసనసభ, 24న శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశాలు 10 రోజులపాటు జరిగే వీలుంది.