మునుగోడు బీఎస్పీ అభ్యర్థి ఖరారు
మునుగోడు ఉప ఎన్నికకు బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి తండ్రి రాములును ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున బరిలోకి దించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి అనుమతి ఇచ్చినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. శంకరాచారికి పార్టీ తరపున బిఫాం అందించారు. ఉన్నత విలువలున్న యువనాయకుడు శంకరాచారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కలుద్దాం` నిలుద్దాం-గెలుద్దాం నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.













