హెడ్‌కానిస్టేబుల్ కూతురుకు అరుదైన గౌరవం
కొండాపూర్‌లోని టీఎస్ఎస్సీ 8వ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ లింగంగారి జనార్దన్ కూతురు లింగంగారి త్రిషకు అరుదైన గౌరవం లభించింది. దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 17 రాష్ట్రాల ఎన్సీసీ కాడెట్స్ నుంచి బ్యానర్ ఆఫ్ ఆలిండియా బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికైన తెలంగాణ, ఆంధప్రదేశ్ డైరెక్టరేట్‌కు దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ఆర్డీ బ్యానర్, బెస్ట్ పీఎం ర్యాలీ ట్రోఫీని డీడీజీ ఎయిర్ కమెడోర్ కృష్ణణ్, సీనియర్ వింగ్ ఆర్మీ సీనియర్ అండర్ ఆఫీసర్ లింగంగారి త్రిష అందుకున్నారు.
ఆమె ఎన్సీసీ బెటాలియన్ 7(టి) బాలిక విభాగం సెయింట్ మార్టిన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలు ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. అత్భుత ప్రతిభ చాటిన విద్యార్థి మియాపూర్‌లోని సెయింట్ మార్టిన్స్ కళాశాల చైర్మన్ జైకిషన్, ఉపాధ్యాయులు అభినందించారు. అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయిలో ట్రోఫీని ప్రధానిచేతుల మీదుగా పొందడం గర్వంగా ఉందన్నారు.













