వ్యాక్సినేషన్ లో తెలంగాణ మరో మైలురాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మరో మైలురాయిని అధిగమించింది. కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంంభమయింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటీ డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ మరో 78 రోజుల్లోనే రెండు కోట్ల మార్కును చేరింది. ఇక కేవలం 27 రోజుల్లోనే అంటే అక్టోబర్ 23 నాటికి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. నాలుగు కోట్ల మైళురాయిని దాటడానికి మరో 45 రోజుల సమయం పట్టింది. అర్హులైనవారిలో ఇప్పటి వరకు 18 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోలేదని సమాచారం.