సీఎంను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌తో కలిసి సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. మల్లన్నతో పాటు చామల కిరణ్‌ను తుమ్మల శాలువా కప్పి సన్మానించారు.