టీఆర్ఎస్ లో చేరిన ఉమామాధవరెడ్డి
మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్ఎస్ సభ్యత్వపత్రాన్ని ఉమామాధవరెడ్డి, సందీప్‌రెడ్డికి అందజేశారు. ఉమామాధవరెడ్డితో పాటు ఆమె అనుచరులు కొమురెల్లి నర్సింహారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నోముల మాధవరెడ్డి, చెరుకు శివయ్యగౌడ్, జంగారెడ్డి, జయరాములు, భువనగిరి వైస్ ఎంపీపీ మోడెపు శ్రీనివాస్, భువనగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రమేశ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతో పాటు రెండువేల మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.













