జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు… ఏపీ వదిలేసి తెలంగాణకు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చిన కేసీఆర్‌తో శాసనసభ ప్రాంగణంలో జేసీ కలిసి పలు అంశాలపై ముచ్చటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని వదిలేసి తెలంగాణకు వస్తామన్నారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని అయితే సాగర్ ఉప ఎన్నికల్లో గెలవడం కష్టమని ఆనాడే చెప్పాన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయోరో అందరికీ తెలుసునని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజం కూడా అంతగా బాగోలేదని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి నాకు తెలియదు అన్నారు.













