తెలంగాణలో టీడీపీ పోటీ.. త్వరలోనే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్తో కలిసి మాట్లాడా. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయన వివరించాను. తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది. శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు ఆమోదించాక పేర్లు ప్రకటన ఉంటుంది. టీడీపీ తరపున రాష్ట్రంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేస్తారు అని తెలిపారు.













