అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర : తన్నీరు మహేష్
తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నిక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని బీఆర్ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ యూఎస్ఏ సలహా బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ పేర్కొన్నారు. కొలంబస్ నగరంలో జరిగిన బీఆర్ఎస్ తొలి జాతీయ సదస్సు 2023 ఆయన అధ్యక్షతన జరిగింది. ప్రముఖ అటార్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షుడు అరింధమ్ గుహ, బ్లూ యాస్ సిటీ కౌన్సిల్ వైస్ మేయర్ ప్రమోద్ రaవేరీ అథితుథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ను అమెరికాలోని అన్నా రాష్ట్రాల్లో బలోపేతం చేయడం, ప్రవాస భారతీయులను ఆహ్వానించి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని వివరించడంపై బీఆర్ఎస్ యూఎస్ దృష్టి సారిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనాకు సంబంధించిన వీడియోలను వివిధ భారతీయ భాషల్లోకి అనువదిస్తామని వెల్లడించారు. సదస్సులో అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.













