ప్రభుత్వ సలహాదారుగా టంకశాల అశోక్
సీనియర్ పాత్రికేయుడు, రచయిత టంకశాల అశోక్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయనను అంతరాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకాలం అంతరాష్ట్ర సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వ్యవహరించేవారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఆ పదవిలో టంకశాల అశోక్‌ను నియమించారు. బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములుతో కలిసి సీఎం కేసీఆర్‌కు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ సీఎం అడుగుజాడల్లో నడుస్తానని, ఇతర రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలను నెలకొల్పేందుకు కృషి చేస్తానని తెలిపారు. అంతరాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేస్తామన్నారు.













