ఖమ్మము కలెక్టర్ ఆఫీసు లో తానా ఫౌండేషన్ సేవా కార్యక్రమం
తానా ఆదరణ: తానా ఫౌండేషన్ మరియు సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మము కలెక్టర్ ఆఫీసు లో కలెక్టర్ శ్రీ గౌతమ్ గారు మరియు తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ రవి సామినేని, సామినేని ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ సామినేని నాగేశ్వరరావు గార్ల చేతుల మీదుగా ఇద్దరు వికలాంగులకు 1,60,00/- విలువైన మూడు చక్రాల స్కూటర్, నిరుపేద విద్యార్థులు కు లాప్ టాప్, అనాథ నిరుపేద విద్యార్థినికి 10,000/- ఆర్ధిక సహాయం ఫౌండేషన్ తరుపున అందచేసారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేదరమెట్ల స్వరూపారాణి, DNF ప్రెసిడెంట్ బోనాల రామక్రిష్ణ, తానా ఫౌండేషన్ ఇండియా ట్రస్టీ శ్రీ పసుమర్తి రంగారావు, బండి నాగేశ్వరరావు, బి.సి.యూత్ రాకేశ్ దత్తా,విజయ భాస్కర్, RMP పాల్గొన్నారు. లబ్దిదారులు ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, ఫౌండేషన్ చైర్మెన్ వెంకటరమణ యార్లగడ్డ, ట్రస్టీ రవి సామినేని గార్లకు కృతఙ్ఞతలు తెలియచేసారు.













