తెలంగాణ గవర్నర్ కు అరుదైన అవకాశం
గిరిజన అభివృద్ధి, ఆరోగ్య సంబంధిత అంశాలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రసంగించారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సంద్భంగా తెలంగాణ గిరిజన ప్రజల్లో పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు ఎస్ఐఎన్, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలతో కలిసి గవర్నర్ చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు గురించి తమిళిసై వివరించారు.
ఆదిలాబాద్, భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాలో గవర్నర్ ఈ ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో గిరిజనుల్లో పోషకాహార సమస్యలపై అద్యయనం చేయనున్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు చేరువయ్యేందుకు హైదరాబాద్ రాజ్‌భవన్, పుదుచ్చేరిలో చేపట్టిన కార్యక్రమాల గురించి గవర్నర్ వివరించారు. ఈ సదస్సులో ప్రసంగించేందుకు మొత్తం ఆరు రాష్ట్రాల గవర్నర్లు ఎంపిక కాగా అందులో తమిళసై సౌందరరాజన్ ఒకరు.













